Homeతెలంగాణపెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని సూర్యాపేట జిల్లా భారాస యువ నాయకులు పరశురామ్ అయ్యప్ప పేర్కొన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమంలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు చురుగ్గా పాల్గొని,రాజకీయాల్లో కమిట్మెంట్ తో పని చేశారని కొనియాడారు.పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకే కాకుండా తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజలతో మమేకమైన నాయకత్వం, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఆయన కుటుంబానికి పార్టీ అండ ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు.ఆయన లేరని మనస్సు తలచుకుంటే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News