Homeబిజినెస్ITR | డిఫెక్టివ్ రిటన్స్ నోటీస్ కి కంగారు పడకండి..

ITR | డిఫెక్టివ్ రిటన్స్ నోటీస్ కి కంగారు పడకండి..

  • పొరబాట్లను సరిదిద్దే అవకాశం ఇది..
  • వచ్చిన ప్రతి నోటీసూ శిక్ష కాదు..

ఇన్‌కమ్ టాక్స్ దాఖలు చేసిన తర్వాత సెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐటీఆర్ దాఖలులో జరిగిన పొరపాట్లను లేదా వ్యత్యాసాలను సరిదిద్దుకోవడానికి ఐటీ శాఖ ఇచ్చే అవకాశమే ఇది. ఫారమ్ 26ఏఎస్, ఏ.ఐ.ఎస్ వివరాలను సరిపోల్చి నిర్ణీత గడువులోగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో స్పందిస్తే ఎటువంటి అదనపు సమస్యలు లేకుండా మీ రిటర్న్ ప్రాసెస్ అవుతుంది.

ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాక, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక నోటీస్ లేదా మెయిల్ రాగానే చాలామంది ప్రాణాల్లో ప్రాణాలు ఉండవు. ఎక్కడ టాక్స్ పెనాల్టీ పడుతుందో, ఏమైనా లీగల్ చిక్కులు వస్తాయో అని తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. కానీ, వచ్చిన ప్రతి నోటీస్ శిక్ష కాదు. ముఖ్యంగా సెక్షన్ 139(9) కింద వచ్చే నోటీస్ అసలు శిక్షే కాదు! మీ రిటర్న్‌లో దొర్లిన ఏదైనా చిన్న పొరపాటును సరిదిద్దుకోవడానికి ఐటీ శాఖ మీకు ఇచ్చిన ఒక చక్కటి అవకాశం ఇది. సమయానికి స్పందిస్తే మీ ఫైలింగ్ సురక్షితంగా పూర్తవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News