Homeస్పోర్ట్స్Saransh Jain | టీం ఇండియాలో కొత్త ముఖం..

Saransh Jain | టీం ఇండియాలో కొత్త ముఖం..

  • 33 ఏళ్ల వయసులో టీమ్ లోకి..
  • చరిత్ర సృష్టించిన సారాంశ్ జైన్..

భారత క్రికెట్‌లో పట్టుదల, నిరంతర శ్రమకు ఫలితం ఎప్పటికైనా దక్కుతుందని మరోసారి రుజువైంది. దాదాపు దశాబ్ద కాలంగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా గుర్తింపునకు నోచుకోని మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ సారాంశ్ జైన్, ఎట్టకేలకు 33 ఏళ్ల వయసులో తొలిసారి భారత టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఆగస్టులో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అతనికి చోటు కల్పించారు. ఎడమచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే సారాంశ్, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తన ఆరాధ్యుడిగా భావిస్తాడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సారాంశ్, 2014లోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అయితే, సుదీర్ఘకాలం పాటు జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చింది. 2022 వరకు కేవలం 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను, ఆ ఏడాది మధ్యప్రదేశ్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి వెలుగులోకి వచ్చాడు. నాకౌట్ దశలో 13 వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఒక అర్ధ సెంచరీతో జట్టు విజయంలో తన వంతు సహకారం అందించాడు.

- Advertisement -

ఇక గతేడాది రంజీ సీజన్ అయితే అతని కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచింది. బ్యాటింగ్‌లో 57.55 సగటుతో 518 పరుగులు, బౌలింగ్‌లో 20.43 సగటుతో 30 వికెట్లు తీసి ఆల్ రౌండర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీనికి ముందు జరిగిన దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లలో 16 వికెట్లు, రెండు అర్ధ సెంచరీలు సాధించి “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును గెలుచుకున్నాడు. సారాంశ్ గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు నెట్ బౌలర్‌గా కూడా సేవలందించాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News