HomeసినిమాSree Vishnu x Ram Abbaraju 2 | మూవీ లో హీరోయిన్ గా సాక్షి...

Sree Vishnu x Ram Abbaraju 2 | మూవీ లో హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

హిలేరియస్ బ్లాక్‌బస్టర్ సామజవరగమనను అందించిన తర్వాత కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి జతకట్టారు. ప్రతిష్టాత్మక పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెకు టీమ్‌లోకి వెల్‌కమ్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో షూటింగ్ స్పాట్‌లోని ఫన్ వైబ్‌ను చూపించారు. టీమ్ మొత్తం సరదాగా గడిపిన మూమెంట్స్‌తో ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

- Advertisement -
Sakshi Madolkar joins Sree Vishnu

‘శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2’  కంప్లీట్ డిఫరెంట్ స్టయిల్ లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్‌. కాన్సెప్ట్, హై-వోల్టేజ్ హ్యుమర్ ఎక్కువగా వుండే కథనంతో, ఈ చిత్రం నాన్-స్టాప్ వినోదాన్ని అందించబోతోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బలమైన తారాగణం, టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సామజవరగమనకి పని చేసిన రైటర్స్ భాను భోగవరపు, నందు సావిరిగణ మరోసారి స్క్రిప్ట్ రాయడానికి చేతులు కలిపారు. వారి కొలాబరేషన్ మరో మెమరబుల్ మూవీని అందించబోతోంది.

త్వరలో మేకర్స్ మిగతా వివరాలు తెలియజేస్తారు.

తారాగణం: శ్రీవిష్ణు, సాక్షి మడోల్కర్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
రైటర్స్: భాను భోగవరపు, నందు సవిరిగణ
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -
RELATED ARTICLES

Latest News