‘నీట్’ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద నల్ల దుస్తులు ధరించి వారు ఆందోళన చేపట్టారు. నీట్ వ్యవహారంపై కేంద్రం పూర్తి బాధ్యత వహించి పారదర్శక విచారణ జరిపించాలని, తద్వారా విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ ఎంపీలు రఘురాం రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, బాష్పవాయువు ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నాలు మానుకుని, వారి సమస్యల పరిష్కారానికి కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
NEET | నీట్ అవకతవకల పై పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నిరసన
By Aadab Desk
- Advertisement -
Previous article
