Homeహైదరాబాద్‌Musheerabad | ముషీరాబాద్ ట్రాఫిక్‌కు గుడ్‌న్యూస్

Musheerabad | ముషీరాబాద్ ట్రాఫిక్‌కు గుడ్‌న్యూస్

  • రోడ్డు గుంతలకు చెక్.. సీసీ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్
  • వాహనదారుల కష్టాలకు త్వరలో ముగింపు
  • సంయుక్త తనిఖీతో సమస్య పరిష్కారానికి ముందడుగు

ముషీరాబాద్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ రాములు, ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిలకలగూడ ట్రాఫిక్ సీఐ జగన్ రెడ్డి, గాంధీనగర్ ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి, చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ ఏడుకొండలుతో పాటు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, బీఎస్‌ఎన్‌ఎల్ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి ముషీరాబాద్ చౌరస్తాలో ఏర్పడిన రోడ్డు గుంతల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంయుక్త తనిఖీ నిర్వహించారు.రోడ్డు గుంతలకు శాశ్వత పరిష్కారంగా నూతన సీసీ రహదారి నిర్మించాలని నిర్ణయించిన అధికారులు, ఉన్నతాధికారుల అనుమతులు పొందిన వెంటనే పనులు ప్రారంభించి ట్రాఫిక్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News