HomeజాతీయంSupreme Court | తెలంగాణ రాష్ట్రానికి చుక్కెదురు..

Supreme Court | తెలంగాణ రాష్ట్రానికి చుక్కెదురు..

  • సాంకేతిక లోపాలతో తెలంగాణ పిటిషన్ కొట్టివేత..

అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాల వినియోగం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అంశాలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తక్షణమే స్టే విధిస్తూ నోటీసులు జారీ చేయాలని కోర్టును తెలంగాణ తరఫు న్యాయవాది కోరారు. అయితే, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో తీవ్ర సాంకేతిక లోపాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. వాటిని సరిచేసే వరకు విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది.

- Advertisement -

ప్రాథమిక లోపాలు సరిదిద్దకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం గానీ, మధ్యంతర ఉత్తర్వులు (ఇంజెక్షన్/స్టే) ఇవ్వడం గానీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ముందుగా పిటిషన్‌లోని లోపాలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆ తర్వాతే మిగిలిన అంశాలపై విచారణ చేపడతామని పేర్కొంది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News