దొపిడిపైనీవుపాడేపాట
విముక్తి భావాలప్రతీక నీ గొంతు
ప్రజల హృదయాల్లో
గూడు కట్టుకున్నది..!
వేలాదిశ్రామికుల నిరసన గళమా ?
ప్రజలజీవితాల్లోమమేకమైనవా
మా హృదయాల్లో త్యాగమైపోయావా!
అరుణోదయ నాగన్న
నీ గొంతు మాట్లాడినా అది
మాకు పాటగానే వినిపిస్తుంది
భిన్న హావభావాల్ని
అద్భుతంగా
ప్రదర్శించగల కళాకారుడా!
నీగొంతు ఆగిపోయిందని
పాటల తల్లి.
నెత్తుటీ కన్నీళ్లు రాలుస్తు
ఎర్రసేనదళముందే జయమంటూ
నీవు పాడుతుంటే
మా కళ్ళు రేపటి అరుణోదయం
ఎర్రసైన్యం కవాతులను స్వప్ని స్తున్నాయి.
మేం అలిసిపోయినా ప్రతిసారి
నవ్వుతూ నవ్విస్తూ పాడుతుంటే
అలసటనే మర్చిపోయాం
అరుణోదయ డప్పు పై పడే
నీ ప్రతిదరువు దోపిడి గుండెల్లో
ల్యాండ్ మైన్లా పేలుతుంది
ఎలుగెత్తి పాడే నీగోంతుక
రాజ్యహింస పై అది సమరభేరి
అది నిత్యం సంజీవనిలా
నీ పాట అనునిత్యం ప్రవాహామే
నీ కలం గళం వేల గొంతుకలై
దోపిడీదారుల గుండెల్లో పిడుగులవుతాయి…!!
Naganna | నాగన్నపాట అనునిత్యం ప్రవాహమే!!
- Advertisement -
