Homeహైదరాబాద్‌Expansion | మా కార్యక్రమాలు దేశమంతా విస్తరింప చేస్తాం..

Expansion | మా కార్యక్రమాలు దేశమంతా విస్తరింప చేస్తాం..

  • ప్రకటించిన బ్రాహ్మణా సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు బాల శ్రీనివాసులు..

బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాలు దేశమంతా విస్తరింప చేస్తున్నామని వ్యవస్థాపకులు బాల శ్రీనివాసులు ప్రకటించారు. హైదరాబాద్, ఉప్పల్ లోని శ్రీ సాయి త్రిశక్తి పీఠం లో సర్వ సభ్యుల సమావేశం లో వారు ప్రసంగిస్తూ.. అనేక సంస్థలతో రాయితీల ఒప్పందం తీసుకొని బ్రాహ్మణులకు సౌకర్యాలను అందిస్తున్నామని ఈ పథకాలను ఇతర రాష్ట్రాలలో ఉన్న బ్రాహ్మణులూ కూడా సద్వినియోగం చేసుకొనే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. వారు మాట్లాడుతూ విద్య, వైద్య రంగంలో ఉన్న దాదాపు 650 సంస్థలతో రాయితీలతో ఒప్పంద తీసుకున్నామని, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని సంస్థలతో ఒప్పందం తీసుకున్నట్టు వారు తెలిపారు. మహిళా అధ్యక్షురాలు పావని శర్మ మాట్లాడుతూ..

బ్రాహ్మణ సంక్షేమ వేదిక అందిస్తున్న ఒప్పంద వివరాలను తమ వెబ్సైట్ ద్వారా తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాయింట్ సెక్రటరీ సి.ఎస్.ఆర్. ఆంజనేయులు మాట్లాడుతూ.. తమ సమాఖ్య ఇప్పటికే దాదాపు 32 భారీ కార్యక్రమాలను నిర్వహించి బ్రాహ్మణుల సంఘటితం కోసం కృషి చేస్తున్నదని, రాబోయే రోజులలో ఈ ఒరవడి ఇంకా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ..

- Advertisement -

బ్రాహ్మణులను ఎవరైనా కించ పరిస్తే వెంటనే చట్టపరమైన చర్య తీసుకొనే విధంగా తమ లీగల్ సెల్ పనిచేస్తున్నదని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో రాజేశ్వరరావు, రంగారావు, ఉజ్వల, చోడవరపు శ్రీనివాసులు, మనోహర్, డాక్టర్ సురేష్, డాక్టర్ రామచంద్ర రావు, మురళి, కళ్యాణి, కిరణ్, రమణ, శారదా, శ్రీదేవి రవీంద్ర, మల్లాది మధు, కంచర్ల వెంకట రమణ, సత్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆతరువాత జరిగిన నూతన సభ్యుల పరిచయ కార్యక్రమంలో దాదాపు 150 నూతన సభ్యులకు బాల శ్రీనివాసులు సభ్యత్వం అందించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News