Homeఆదాబ్ ప్రత్యేకంLegal Metrology | నేనే రాణి.. నేనే మంత్రి..

Legal Metrology | నేనే రాణి.. నేనే మంత్రి..

అన్నీతానై రాజ్యమేలుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఉమారాణి..

  • లీగల్ మెట్రాలజీలో అవకతవకల పరిపాలన..
  • లోపాల పునాదులపై సాగుతున్న అడ్మినిస్ట్రేషన్..
  • 8 ఏళ్లుగా నిర్వీర్యమవుతున్న లీగల్ మెట్రోలాజి ఫ్లైయింగ్ స్కాడ్..
  • తమ బాధ్యతలు విస్మరించి మిగతా వ్యవహారాలపై నజర్..
  • ఏ అధికారంతో ప్రధాన కార్యాలయాల ఫైల్స్ చూస్తోంది..?
  • ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..?
  • ఉమారాణి కోసం ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..?
  • ఇతర అధికారులకు అదనపు భాద్యతలు ఎలా కేటాయిస్తుంది..?
  • ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్న సామాజికవేత్తలు..

ఆమె ఒక ఉన్నతాధికారిణి.. విధులు నిర్వహిస్తున్నది ప్రతి ష్టాత్మకమైన లీగల్ మెట్రాలజీ శాఖలో.. పైగా కీలకమైన ఫ్లైయింగ్ స్కాడ్ బాధ్యతలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. కానీ దురదృష్టం ఏమి టంటే సదరు అధికారిణి తాను నిర్వర్తించాల్సిన విధులను అటకెక్కించేసి, తనకు సంబంధం లేని వ్యవహారాల్లో, బాధ్య తల్లో తలదూర్చడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతు న్నాయి.

- Advertisement -

లీగల్ మెట్రాలజి ప్రధాన కార్యాలయంలోని ఫైళ్ల నిర్వహణ సాగిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.. తగుదునమ్మా అంటూ లేని అధికారాలను ప్రదర్శిస్తూ ఇతర అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయించి వారి నెత్తిన గుదిబండలా తయారయ్యిందనే ఆరోరోపణలు వెల్లువెత్తు తున్నాయి.. సుదూరానికి ప్రయాణించి ఆ అదనపు బాధ్యత లు నిర్వహించడం తమకు తలకుమించిన భారంగా పరిణ మించిందని ఆ అధికారులు తలబాదుకుంటున్నారు.

దీనితో తమకు అప్పగించిన పనులను చేయలేక సతమత మవు తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో లీగల్ మెట్రా లజీలో పరిపాలన కుంటుపడిందని పలువురు తమ అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఉమారాణి వ్యవహారంపై పలు ప్రశ్నలు ఇబ్బడి ముబ్బడిగా తలెత్తుతున్నాయి..

లీగల్ మెట్రాలజీ శాఖ ప్రధాన కార్యాలయంలో పరిపాలనా విధానాలపై పలువురు ఫిర్యాదుదారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమారాణి విధుల నిర్వహణ, ఫ్లయింగ్ స్క్వాడ్ పనితీరు, ఆర్టీఐ చట్టం అమలు, అదనపు బాధ్యతల కేటాయింపులు.. తదితర అంశాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.

Legal Metrology Department Administrative Irregularities Allegations

ఫ్లయింగ్ స్క్వాడ్ 8 ఏళ్లుగా నిర్వీర్యం? :

ఫిర్యాదుదారుల ఆరోపణల ప్రకారం, జీఓ ఎంఎస్ నెంబర్ : 864 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాల్సిన ఫ్లయింగ్ స్క్వాడ్ యూనిట్ గత ఎనిమిదేళ్లుగా సమర్థవంతంగా పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. అయినప్పటికీ, ఆ యూనిట్‌కు సంబంధించిన విధులు నిర్వహించాల్సిన ఉమారాణి, తనకు కేటాయించిన బాధ్యతల కంటే ప్రధాన కార్యాలయ పరిపాలనా వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో పలు ప్రశ్నలు తలెత్తుతు న్నాయి..

ఎనిమిదేళ్లుగా నిర్వీర్యంగా ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ యూనిట్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారి ప్రధాన కార్యాలయ పరిపాలనా ఫైళ్లను ఏ అధికారంతో పరిశీలిస్తున్నారు?ఆర్.టి.ఐ. చట్టం ప్రకారం పీ.ఐ.ఓ. నియామకం, ఆమెకు అధికార పత్రం లేదనే ఆరోపణ కూడా వుంది.. ప్రధాన కార్యాలయంలో ఆర్టీఐ చట్టం ప్రకారం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అధికారికంగా నియమించలేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.

అయినప్పటికీ, ఉమారాణి పీఐఓగా వ్యవహరిస్తూ ఆర్టీఐ దరఖాస్తులను పరిష్కరించడం, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అప్పీళ్ల విచారణలకు హాజరవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆవిడ అధికారిక నియామకం లేకుండా పీఐఓ విధులు ఎలా నిర్వహిస్తున్నారు? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు ఏమైనా జారీ అయ్యాయా? అన్నది కూడా తెలియాల్సి ఉంది..

అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టు లేకపోయినా
ఆ హోదాలో విధులు?

లీగల్ మెట్రాలజీ శాఖలో అసిస్టెంట్ కంట్రోలర్ (హెడ్ క్వార్టర్స్) లేదా అసిస్టెంట్ కంట్రోలర్ (పరిపాలన) పేరుతో అధికారిక పోస్టు మంజూరు కాలేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. అయితే అలాంటి పోస్టు లేకపోయినా ఉమారాణి ఆ హోదాతో పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే అధికారికంగా పోస్టు లేకపోతే ఆ హోదా ఎలా నిర్వేషణలోకి వచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు?

అదనపు బాధ్యతల కేటాయింపులపై అభ్యంతరాలు :

ఒకే అధికారికి మూడు నుంచి నాలుగు కార్యాలయాల అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రజలకు/వినియోగదారులకు అందాల్సిన సేవలు దెబ్బతింటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.. ఈ విధమైన ఏర్పాట్లు సరైన పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధమని పలువురు అంటున్నారు.

కొన్ని ఉదాహరణలు :

శ్రీలత (ములుగు, భూపాలపల్లి)కి ఖమ్మం డీ.ఎల్.ఎం.ఓ. బాధ్యతలు అదనంగా అప్పగించారు. సుమారు 170 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది..
ఎండి. అజీజ్ (కరీంనగర్)కు జగిత్యాల, ఆసిఫాబాద్ డీ.ఎల్.ఎం.ఓ. బాధ్యతలు అదనంగా అప్పగించారని, దాదాపు 300 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది..

నాగేశ్వరరావు (నాగర్‌కర్నూల్)కు సూర్యాపేట బాధ్యతలు కేటాయించడంతో సుమారు 140 కి.మీ. ప్రయాణం అవసరమవుతోంది..
కె. సిద్ధార్థ కుమార్ (నల్గొండ)కు వరంగల్, కరీంనగర్ అసిస్టెంట్ కంట్రోలర్ బాధ్యతలతో పాటు వరంగల్ రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించారని, మొత్తం 270 కి.మీ. వరకు ప్రయాణించాల్సి వస్తోంది..
అలాగే టి. శివానంద్ (హైదరాబాద్)కు హైదరాబాద్ రూరల్ రీజినల్ డిప్యూటీ కంట్రోలర్‌తో పాటు నిజామాబాద్ అసిస్టెంట్ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించారు.. దాదాపు 170 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది..

ఒకే అధికారి అనేక జిల్లాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వ హించడం సాధ్యమేనా? ఇలాంటి అదనపు బాధ్యతల వల్ల ప్రజా సేవలపై ప్రభావం పడదా? మరి ఇలాంటి నిర్ణయాలు ఉమారాణి ఏ ధైర్యంతో, ఎవరి ప్రోద్భలంతో తీసుకుంది.. ఉమారాణి తీసు కుంటున్న అర్ధం పర్ధంలేని ఈనిర్ణయాల వెనుక ఎవరున్నారు..? స్వయంగా ఆవిడే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా..?

తనకు లేని అధికారాలను ప్రదర్శిస్తుంటే ఉన్నతాధి కారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు..? లేక ఆమెను అడ్డుకునేం దుకు ఎవరికీ ధైర్యం చాలటం లేదా..? ఏదైనా శక్తి ఆమె వెనుక ఉందని గ్రహించి మిన్నకుండిపోతున్నారా..? అసలేం జరుగుతోంది.. అన్న వ్యవహారాలపై సమగ్ర సమాచారంతో.. సంపూర్ణ ఆధారాలతో వాస్తవాలను వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News