Homeఆదాబ్ ప్రత్యేకంNalgonda | వైద్యారోగ్య శాఖలో 'నకిలీ స్పౌజ్' కలకలం!

Nalgonda | వైద్యారోగ్య శాఖలో ‘నకిలీ స్పౌజ్’ కలకలం!

  • అధికారుల అండతో అక్రమ బదిలీల దందా!
  • నకిలీ స్పౌజ్ సర్టిఫికెట్‌తో అక్రమ బదిలీ
  • అర్హురాలికి రావాల్సిన పోస్టు కాజేశారన్న విమర్శలు
  • ఫోర్జరీ సంతకాలపై సంచలన ఆరోపణలు
  • అధికారుల మౌనంపై ఉద్యోగుల ఆగ్రహం
  • సమగ్ర విచారణకు ఉద్యోగ సంఘాల డిమాండ్

నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ‘నకిలీ స్పౌజ’ (భర్త) సర్టిఫికెట్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి, తప్పుడు పత్రాలతో అక్రమ బదిలీలు చేయించుకున్న ఘటనపై ఉద్యోగ వర్గాల్లో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఒక వ్యవస్థలో ఉంటూ పక్కవారి కడుపు కొట్టేలా సాగుతున్న ఈ దందా చూస్తుంటే, “కుక్క తోక వంకర అన్నట్టు” ఈ విభాగంలో అక్రమాలు అలవాటుగా మారాయని స్పష్టమవుతోంది.

నాగార్జున సాగర్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో ఏఎనఎంలు గా పనిచేస్తున్న కే. రమణి, జె. సుజాత సహోద్యోగులు. బదిలీల సమయంలో అర్హత ఉన్న సుజాతకు రావాల్సిన నకిరేకల్ స్థానాన్ని, రమణి తన పలుకుబడితో అక్రమంగా కొట్టేసింది. ఇందుకోసం ఆమె ఏకంగా డి. గోవింద్ నాయక్ పేరుతో నకిలీ స్పౌజ్ సర్టిఫికెట్‌ను సృష్టించి, అధికారుల కళ్లు గప్పింది. దీనిపై బాధితురాలు సుజాత సంబంధిత ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా, ఎవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే “దెయ్యాలకే దయ్యాలు జబ్బలు చరుచుకున్నట్టు” తయారైందని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.

- Advertisement -
Fake Spouse Certificate Medical Department Scandal2

‘షాడో డీఎంహెచఓ’ కనుసన్నల్లోనే దందా?

వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి. గోవింద్ నాయక్ పాత్రపై వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆయనను కలవనిదే ఏ ఫైల్ కదలదని, ఆయనే ‘షాడో డీఎంహెచఓ’గా చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో డీటీసీఓగా పనిచేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి, రమణికి సర్టిఫికెట్ ఇప్పించారనే ఆరోపణలు వస్తున్నా, అధికారులు మిన్నకుండటం విడ్డూరం. డి. గోవింద్ నాయక్‌కు సునీత అనే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని అందరికీ తెలిసినా, అధికారులకు మాత్రం అవేవీ తెలియకపోవడం విచారకరం. “చేతిలో వెన్న పెట్టుకుని నేతికి వెతికినట్టు”, అందరికీ తెలిసిన సత్యాన్ని అధికార వర్గాలు కావాలనే కప్పిపుచ్చుతున్నాయి.

వెంటనే విచారణ జరపాలి!

ఈ అక్రమ బదిలీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి:
ఇద్దరు ఏఎనఎంల సర్వీస్ రిజిస్టర్లు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ రికార్డులను వెంటనే పరిశీలించాలి.
పిల్లల స్కూల్ రికార్డులు, నామినీ వివరాలను ఎంక్వయిరీ చేయాలి.

Fake Spouse Certificate Medical Department Scandal0

నకిలీ సంతకాలు చేసిన వారిని, ఆ సర్టిఫికెట్ జారీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి.

ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా జిల్లా డీసీహెచఎస్ కార్యాలయం చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఉన్నతాధికారులు తేల్చాలి. లేనిపక్షంలో వ్యవస్థ పట్ల నమ్మకం పోతుందని హెచ్చరిస్తున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో శాఖలో మరింత అరాచకం పెరిగే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News