అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక ట్రైలర్‌కి నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా చిత్రయూనిట్ మరో సర్ ప్రైజ్‌తో అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పె ంచింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘లెనిన్’ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా కథను, నేపథ్యాన్ని, శ్రీరామపురం గురించి ఎన్టీఆర్ తన గంభీరమైన గాత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఇక థియేటర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌కి, ఆయన ఇచ్చే ఎలివేషన్స్‌కి బాక్సులు బద్దలయ్యేలా ఉంది.

ఎన్టీఆర్ ఇచ్చే ఈ వాయిస్ ఓవర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్‌కి నాగార్జునతో, అక్కినేని కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. అందుకే అఖిల్ కోసం ఎన్టీఆర్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి ‘లెనిన్’కి తన వంతుగా సపోర్ట్ చేశారు.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అఖిల్ రగ్డ్ రా అండ్ రస్టిక్ లుక్ ఇప్పటికే అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం, నేపథ్య సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరావర్క్ హైలెట్‌గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం 2026 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక బృందం
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాత : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
బ్యానర్లు : మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ :నవీన్ నూలి
DOP :లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ :అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :ఆనంద్ రెడ్డి కర్నాటి
పోస్ట్ ప్రొడక్షన్ : అన్నపూర్ణ స్టూడియోస్
కలరిస్ట్: వివేక్ ఆనంద్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో : వంశీ కాకా
