ఇండియాలో టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ప్రేక్షకులను డిఫరెంట్ కంటెంట్‌తో అలరిస్తోన్న జీ5 ఇప్పుడు మరో వైవిధ్యమైన సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’తో ప్రేక్షకుల మెప్పించనుంది.

వీరభ్రదపురం.. అందమైన పల్లెటూరు.. అయితే ఆ ఊరు వెనుక తెలియని ఓ రహస్యం ఉంది..అదే వీరభద్రుడు. ఊరిని కాపాడే వీరభద్రుడు నుంచి తప్పు చేయాలనుకున్నవారు తప్పించుకోలేరు.. ఊళ్లోని ధర్మ గంట మోగిందంటే.. తప్పు చేసిన వాళ్లు అంతం కాక తప్పదు. దీంతో ఊళ్లోని ప్రజలు క్రమశిక్షణతో మెలుగుతుంటారు.
అలాంటి ఊర్లోకి వెన్నెల అనే అమ్మాయి (అనీ) వస్తుంది. తను ఊళ్లో వీరభద్రుడు చేసే పనులను గమనిస్తుంది. తనేం చేస్తుంది.. నిజంగానే వీరభద్రపురంలో వీరభద్రుడు ఉన్నాడా? తప్పు చేసినవాడిని శిక్షిస్తున్నాడా? ఇంతకీ వీరభద్రపురంలోని ఆ రహస్యం ఏంటనేది తెలుసుకోవాలంటే వీరభద్రుని రహస్యం సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 3 నుంచిరెండు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ మొదలు కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్‌ను గమనిస్తే..
అర్ధరాత్రి చెట్టుకింద కొలువైన వీరభద్రుడి దగ్గరకు ఓ పిల్లాడు నడుచుకుంటూ వస్తాడు. ‘కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం పుట్టడానికి కారణమైన బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఈ భూమ్మీద పుట్టిన మొదటి జీవం వరకు అన్నీ యాక్సిడెంటే’ అని ఓ వ్యక్తి వివరిస్తుంటాడు. అప్పుడు ఓ వ్యక్తి లేచి ‘సర్..మరి దేవుడు సంగతేంటి?’ అని ప్రశ్నించగానే.. చెబుతున్న వ్యక్తి మొహంలో ఓ ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడి నుంచి వీరభద్రపురంలో జరిగే విషయాలను తెలియజేసేలా పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్ సాగింది. దీంతో సిరీస్‌పై ఆసక్తి రెట్టింపైంది.
వీరభద్రుని రహస్యం సిరీస్ లో ప్రతి వారం కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతూ వస్తాయి. 60 ఎపిసోడ్స్‌తో రూపొందించిన సిరీస్ ఓ లాంగ్ ఫార్మ్ మిస్టరీగా ఒక్కో ఎపిసోడ్ రహస్యాలను రివీల్ చేస్తూ, ట్విస్టులు బయటపెడుతూ ముందుకు సాగుతుంది. వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, ఎస్సై అభినవ్‌గా రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష, అనురాధ, బాలచంద్ర, కల్కి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
