- అడ్డగుట్టలో పల్స్ పోలియో కార్యక్రమం
- పాల్గొన్న మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్న
పల్స్ పోలియో రెండు చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇద్దామని అడ్డగుట్ట మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో దినాన్ని పురస్కరించుకుని తుకారాంగేట్, బోయబస్తీలోని అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5ఏళ్ల లోపు చిన్నారుల నిండు జీవితానికి ప్రతి ఏటా రెండు చుక్కలు ఎంతో అవసరమని అన్నారు. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇంచార్జ్ డాక్టర్ మౌనిక, సూపర్వైజర్ అరుణ కుమారి, బీఆర్ఎస్ నాయకులు లింగాని శ్రీనివాస్, సత్తయ్య గౌడ్, మనోహర్, మోహన్, మహమ్మద్, ప్రవీణ్, దేవయ్య పాల్గొన్నారు.
