- డా. శ్రావంతి రెడ్డి, ప్రముఖ క్యాన్సర్ నిపుణురాలు, యశోద హాస్పిటల్
క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో, వైద్య రంగంలోని ఆధునిక ఆవిష్కరణల గురించి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని యశోద హాస్పిటల్స్‌కు చెందిన ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణురాలు డా. శ్రావంతి రెడ్డి పేర్కొన్నారు.గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. శ్రావంతి రెడ్డి మాట్లాడుతూ…
క్యాన్సర్ లక్షణాలు మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరికొత్త చికిత్సా పద్ధతుల గురించి విస్తృతంగా వివరించారు. ఒకప్పుడు క్యాన్సర్‌ను మరణశిక్షగా భావించేవారని, కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఇప్పుడు స్టేజ్ IVలో ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులు కూడా చాలా సంవత్సరాల పాటు సాధారణ జీవితాన్ని గడపగలరని ఆయన పేర్కొన్నారు.క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి కాదని, అది 100కు పైగా విభిన్న వ్యాధుల సమూహమని డాక్టర్ శ్రావంతి రెడ్డి నొక్కి చెప్పారు.
క్యాన్సర్ రోగులు తమ వ్యాధి దశను నిర్ధారించుకోవడానికి, తగిన అధునాతన చికిత్స పొందడానికి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిని సందర్శించాలని డాక్టర్ శ్రావంతి రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు.
