Friday, June 19, 2026
Homeఆరోగ్యంWeight Loss Diet | బరువు తగ్గాలనుకున్నారా ఇలా చేయండి..

Weight Loss Diet | బరువు తగ్గాలనుకున్నారా ఇలా చేయండి..

  • శనగల మిక్చర్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి..
  • ఒక్క చుక్క నూనె వాడకుండా చేసుకోవచ్చు..

బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్ ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, మీరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా హెల్తీ అని చెప్పొచ్చు. ఇంకా దీనిలో నూనె ఒక్క చుక్క కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం..

శెనగల మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల శెనగలు, ఒక పెద్ద టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక కీరా దోసకాయ , ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు, దీనిలో నూనె అవసరం లేదు కాబట్టి వాడాల్సిన అవసరం లేదు. దీనితో సరైన విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది.

- Advertisement -

నగల మిక్చర్ తయారీ విధానం: ముందుగా శెనగలు తీసుకుని వాటిని కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే, ఉల్లిపాయను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా కీరా దోసకాయ, టమాటాలను కూడా తీసుకుని ఒక గిన్నెలో వేయాలి. ఇలా కలిపిన వీటిని 15 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. శెనగల మిక్చర్ తయారీ విధానం స్టెప్ 2: ఇప్పుడు వీటిని తీసుకుని కొద్దిగామసాలా పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, రుచికి తగినంత ఉప్పును వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట తీసుకుంటే డబ్బులు లేకుండానే మంచి ఫలితం వస్తుంది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News