Monday, June 22, 2026
Homeఆదిలాబాద్Inspection | విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి..

Inspection | విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి..

  • సోఫీనగర్ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు
  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు

విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి బి. వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం సోఫీనగర్‌లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన హాస్టల్ గదులు, వంటశాల, పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, వసతుల విషయంలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ముచ్చటించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ రుచికరమైన, పౌష్టికాహారం అందుతున్నదా లేదా అని విద్యార్థులను అడిగి నిర్ధారించుకున్నారు.

చదువులో ఏవైనా సందేహాలు ఉన్నా, సమస్యలు ఎదురైనా వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధి విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఈ పరిశీలనలో ప్రిన్సిపాల్ డానియల్, ఎం. ఈ. ఓ పద్మ, ఉపాధ్యాయులు కల్పన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News