Saturday, June 20, 2026
Homeనల్లగొండYadadri | యాదగిరీశుని సన్నిధిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Yadadri | యాదగిరీశుని సన్నిధిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

  • తన కూతురు, సన్నిహితులతో కలిసి యాదాద్రి దివ్య క్షేత్రం సందర్శన.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, సన్నిహితులు మోహన్ యశ్వంత్ పాటిల్, సుమిత అరుణ్ సింగ్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శనివారం ఉదయం యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు శ్రీలక్మీనర్సింహా స్వామిని దర్శించుకున్నారు.

ఆలయ సాంప్రదాయ ప్రకారం ఎంపీ రవిచంద్రకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి, పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆశీర్వచనం చేయగా ఆలయ డిఇఓ నవీన్ కుమార్ స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ రాజన్ బాబు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News