- బంజారా భవన్‌లో ఘనంగా చీరల పంపిణీ కార్యక్రమం..
- ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్..
- మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి..
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ బంజారా భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మహిళా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళల అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద పెద్ద సంఖ్యలో మహిళా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేయగా, కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సభలోని ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, వెంకట బాల్మూర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి లబ్ధిదారులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
