- ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు వేడుకోలు
విద్యుత్తు షాక్ తగిలి ఫైజాబాద్ గ్రామానికి చెందిన రామస్వామి పెద్ద సత్యగౌడ్ అనే రైతుకు చెందిన రూ.96 వేలు విలువైన నిండు సూలు ఉన్న గిరిజాతి ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తో మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.రైతు తెలిపిన వివరాల ప్రకారం…వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో శనివారం ఉదయం మేతకు వెళ్లిన గిరిజాతి ఆవు ప్రమాదవశాత్తు ఎట్టిగడ్డ (గిద్దెమీద)శివారులో ఉన్న ట్రాన్స్ పార్మర్ సపోర్ట్ తీగకు తగిలి విద్యుత్తు షాక్ తో మరణించిందని కన్నీరుమున్నీరైయ్యాడు.

రైతు విద్యుత్తు శాఖ అధికారులకు, పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా మృతి చెందిన ఆవును పరిశీలించారు.చనిపోయిన ఆవు విలువ సుమారు రూ.96వేలు ఉంటుందని యజమాని సత్యగౌడ్ తమకి తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.అధికారులు కూడా రైతుకు ప్రభుత్వపరంగా సహాయం అందేలాగా కృషి చేస్తామని రైతు సత్యగౌడ్ కు హామీ ఇచ్చారు.
