- ఇరాన్ పై అమెరికా వరుస దాడులు..
- అపాచీ హెలికాఫ్టర్ కూల్చివేత..
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితుతులు ఏర్పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ డ్రోన్ దాడితో కూల్చేసింది. హార్ముజ్ జలసంధి వద్ద, ఒమన్ తీరంలో హెలికాప్టర్‌ను పేల్చివేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి పరిధిలోని క్వెష్మ్ ఐలాండ్‌తోపాటు పోర్ట్ సిటీ అయిన సిరిక్‌పై కూడా అమెరికా దాడి చేసిందని ఇరాన్ తెలిపింది.
జాస్క్ కౌంటీ సమీపంలోని బండార్ అబ్బాస్ వద్ద కూడా పేలుడు జరిగిందని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ దక్షిణ భాగంలోని అనేక ప్రాంతాలపై అమెరికా దాడి చేస్తోందని ఆ దేశం తెలిపింది. తమ హెలికాప్టర్‌పై జరిగిన దాడికి బదులుగా, ఆత్మరక్షణ విధానంలో భాగంగానే దాడులు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇరాన్ ఏ దాడినీ వదిలిపెట్టబోదన్నారు.
