Saturday, June 6, 2026
Homeకెరీర్ న్యూస్PGECET | సమూలంగా మారనున్న పీజీఈసెట్ పరీక్ష..

PGECET | సమూలంగా మారనున్న పీజీఈసెట్ పరీక్ష..

  • ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు..
  • ప్రభుత్వానికి త్వరలోనే చేరిక..

ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌(పీజీఈసెట్‌) పరీక్ష విధానం సమూలంగా మారనున్నది. కొత్తగా అర్థమెటిక్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులను ఈ పరీక్షలో అంతర్భాగం చేయనున్నారు. పీజీఈసెట్‌ పరీక్ష రాసే వారంతా ఈ రెండు సబ్జెక్టులకు పరీక్షలు రాయాల్సిందే.

ఒక్కో సబ్జెక్టుకు 25% చొప్పున వెయిటేజీ ఇవ్వనున్నారు. సంబంధిత సబ్జెక్టులకు 50% వెయిటేజీ ఉంటుంది. పీజీఈసెట్‌ పరీక్షల్లో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ జేఎన్టీయూహెచ్‌ ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు పంపించింది. ఇవి త్వరలోనే సర్కార్‌కు చేరుతాయి. ఈ ప్రతిపాదనలను సర్కార్‌ ఆమోదిస్తే 2027-28 విద్యాసంవత్సరంలో కొత్త విధానం అమల్లోకి వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News