Thursday, June 4, 2026
Homeతెలంగాణఈటల పై అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఈటల పై అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ ముదిరాజ్ పై జరుగుతున్న దుష్ప్రచారం దుర్మార్గమని, ఈ దుష్ప్రచారాన్ని, ఈటల రాజేందర్ ముదిరాజ్ పై వెలిసిన అభ్యంతర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పొన్నం మొగిలి ముదిరాజు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…

ఈటల రాజేందర్ ముదిరాజ్ ‌ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఈటెల రాజేందర్ ముదిరాజ్ ప్రతిష్టను దెబ్బతీయాలనె ఉద్దేశ్యంతోనే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ కు కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారాలు తెరలేపడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

అభ్యంతరక మైన పోస్టర్లు అతికించిన వారిని నిఘా నేత్రాల ఆధారంగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు ఈటల రాజేందర్ ముదిరాజ్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రలను ముదిరాజ్ జాతి ఐక్యంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఇలాంటి దుష్ప్రచారులు ఆయన కు ప్రజాదరణ ను ఏమాత్రం తగ్గించలేవని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు చొప్పరి సోమయ్య ముదిరాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జీనుకుల కొమ్మాలు ముదిరాజ్
జిల్లా గౌరవ అధ్యక్షులు, నీరటి సదానందం ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరంగల్, గోనెల నరహరి ముదిరాజ్, జిల్లా కార్యదర్శి ఈర్ల నరసింహ రాములు ముదిరాజ్, జిల్లా నాయకులు నాయిని వేణు ముదిరాజ్, జిల్లా యువత కార్యదర్శి పల్లె రమేష్ ముదిరాజ్, మండల అధ్యక్షులు దుగ్గొండి నెదురు రాజేందర్ ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి దుగ్గొండి డేగల కిరణ్ ముదిరాజ్, నర్సంపేట పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News