Sunday, May 31, 2026
Homeక్రైమ్ వార్తలుMatrimonial Fraud | మహిళను మోసం చేసిన దుండగుడు..

Matrimonial Fraud | మహిళను మోసం చేసిన దుండగుడు..

  • ప్రేమ పేరుతో రూ. 14 లక్షలు మోసం..
  • ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసిన దుర్మార్గం..

మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను రూ.14 లక్షలకుపైగా మోసగించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 31 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్‌లో 36 ఏళ్ల రాఘవేంద్ర కిషోర్ అవస్థి పరిచయమయ్యాడు. అతడి భార్య జీవించి ఉన్నప్పటికీ చనిపోయిందని అబద్ధం చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా, జిమ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పెట్టుబడి పేరుతో ఆ మహిళను రాఘవేంద్ర డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.14.8 లక్షలు తీసుకుని ఆమెను మోసగించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాఘవేంద్ర తనను మానసికంగా వేధించాడని, శారీరకంగా దాడి చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా ఈ కుట్రలో అతడికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News