- డిస్ ప్లే పిక్చర్ కూడా మార్పు..
- విరాట్ కోహ్లీతో కలిసి తీసిన రీల్ కూడా డిలీట్..
భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉన్న సుమారు 200 పోస్టులను అకస్మాత్తుగా డిలీట్ చేశారు. తన డిస్‌ప్లే పిక్చర్‌ను కూడా అతను మార్చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీతో తీసిన రీల్‌ను కూడా అతను డిలీట్ చేశాడు. ఆ రీల్‌కు సుమారు 15 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఎందుకు సడెన్‌గా తన ఇన్‌స్టా పోస్టులను డిలీట్ చేశాడో అర్షదీప్ చెప్పలేదు. బహుశా వ్యక్తిగతంగా తన మొబైల్‌ను రీసెట్ చేసి ఉంటాడని అతని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో క్లీనప్ చేపట్టి ఉంటాడని అనుకుంటున్నారు. రీ బ్రాండింగ్ కోసం అర్షదీప్ ప్రయత్నిస్తున్నాడేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
- Advertisement -
