Tuesday, May 26, 2026
HomeజాతీయంKashmir | మరోసారి కాశ్మీర్ అంశం తెరపైకి..

Kashmir | మరోసారి కాశ్మీర్ అంశం తెరపైకి..

  • ఉగ్రవాద సంస్థల కుట్ర..
  • ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ ల సంఖ్య పెంపు..

కశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ సరికొత్త కుట్రలకు తెరలేపింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్యను పెంచడం, అదే సమయంలో ప్రచార యుద్ధాన్ని ఉద్ధృతం చేయడం అనే ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు పాక్ రాజకీయ ప్రముఖులతో లష్కరే అగ్రనాయకత్వం వరుసగా జరుపుతున్న భేటీలు భారత ఏజెన్సీల నిఘాలో పడ్డాయి.

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడటానికి పీఓకే సరిహద్దుల్లో దాదాపు 500 మందికి పైగా లష్కరే ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల భారత భద్రతా దళాల అప్రమత్తత కారణంగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలన్నీ విఫలమవడంతో లష్కరే నాయకత్వం తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్యను పెంచి, అక్కడ ఉగ్రవాదుల సంఖ్యను వెయ్యికి చేర్చాలని పీఓకేలో జరిగిన ఓ కీలక సమావేశంలో లష్కరే నిర్ణయించినట్లు గుర్తించారు.

- Advertisement -

భారత సైన్యాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేయడమే లక్ష్యంగా చొరబాటు యత్నాల సంఖ్యను అనేక రెట్లు పెంచాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 26 మంది ప్రాణాలు బలిగొన్న పహల్గామ్ దాడికి లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ కారణం కాగా.. ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మురిద్కేలోని లష్కరే ప్రధాన శిక్షణా కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికే ఉగ్రవాదులు ఇప్పుడు మళ్లీ యత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News