బిడ్డా నేనాపీసర్నీ చూస్తా.. పొట్టిగుండ, పోడుగ్గుండ నల్లగుండ, తెల్లగుండ సన్నగుండ, లావుగుండ అసలు మనసున్న మనిషేనా అని చూస్తా..! నీ కులం చెప్పనీకే వాడెవడో చూస్తా అమ్మననను, ఆలిననను అక్కననను, చెల్లిననను ఇజ్జత్ గానే అడుగుతా మన కులం గురించి వాడికి తెలుపుతా.. కులం లేని, మతం లేని సమాజానికి నడుద్దాం.. నీవు నేను ఏకమై కుల వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చేద్దాం
- డాక్టర్.ఎస్. విజయ భాస్కర్..
- Advertisement -
