Sunday, May 24, 2026
Homeఆంధ్రప్రదేశ్BTech Ravi | జగన్ మోహన్ రెడ్డిలో రెండో షేడ్ వుంది..

BTech Ravi | జగన్ మోహన్ రెడ్డిలో రెండో షేడ్ వుంది..

  • సంచలన వ్యాఖ్యలు చేసిన బీటెక్ రవి..
  • వై ఎస్ కుటుంబం ఎదగడం వెనుక ఎన్నెన్నో హత్యలున్నాయి..
  • వాళ్ళ అసలు స్వరూపం తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైసీపీ అధినేత జగన్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుంబం మూడు తరాలుగా హత్యా రాజకీయాలు చేస్తోందని, వారి రాజకీయ ఎదుగుదల వెనుక ఎన్నో హత్యలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

“ఈ రోజు నేను మీ ముందుకొచ్చింది వైఎస్ కుటుంబం యొక్క అసలు స్వరూపాన్ని, వాళ్ల మూడు తరాల రక్త చరిత్రను ప్రజల ముందు ఉంచడానికి. హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వైఎస్ కుటుంబం గురించి, వాళ్ల రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్న అరాచకాల గురించి మాట్లాడడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను.

- Advertisement -

వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ల చరిత్ర చూస్తే, ఆనాడు బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా వ్యవహరించి, ఈ దేశానికే అన్యాయం చేసిన చరిత్ర వాళ్లది. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు, వాళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎందరో అమాయకులు హత్యకు గురయ్యారు. వాళ్ల పునాదులే రక్తంతో తడిసినవి. వార్డు మెంబర్ స్థానానికి కూడా ఓడిపోయిన నీచ చరిత్ర వైఎస్ కుటుంబానిది. 1968 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తల్లి వైఎస్ జయమ్మ, గాడిచర్ల కృష్ణమూర్తి అనే సామాన్య వ్యక్తి చేతిలో ఓడిపోయారు. ఇక 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీటర్ కేసు నమోదైంది.

ఆ తర్వాత, రాజారెడ్డి మంగంపేట బైరటీస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర చేరాడు. ఏ పెట్టుబడి లేకుండానే ఆయన వ్యాపారంలో భాగస్వామిగా చేరి, ఆ తర్వాత ఆయన్నే హత్య చేశాడు. ఆ హత్యా రాజకీయ పునాదిపైనే రాజారెడ్డి ఎదిగాడు. ఆ హత్యకు సహకరించిన పౌలిరెడ్డి అనే వ్యక్తి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ తర్వాత త్రివేణి స్టీల్ యజమాని మురళి రెడ్డిని హత్య చేశారు. ఆ హత్య తర్వాతే వాళ్లకు కొళ్లం గంగిరెడ్డి కుటుంబంతో బంధం ఏర్పడింది. 1989లో చిన్నముడియం గ్రామంలో రిగ్గింగ్ చేయడానికి వెళితే, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ కక్షతో శివారెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. శివారెడ్డి మరణం తర్వాతే వైఎస్ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News