HomeసినిమాBirthday Special | "డేవిడ్ రెడ్డి" మూవీ టీజర్ రిలీజ్

Birthday Special | “డేవిడ్ రెడ్డి” మూవీ టీజర్ రిలీజ్

‘రా కింగ్’ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా “డేవిడ్ రెడ్డి”. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

David Reddy Teaser Manchu Manoj Birthday Release

ఈ రోజు ‘రా కింగ్’ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా “డేవిడ్ రెడ్డి” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ప్రతి విజువల్, ప్రతి షాట్, నటీనటుల ఎంపిక ఇలా…అన్ని విషయాల్లో హై క్వాలిటీ మేకింగ్ వ్యాల్యూస్ కనిపిస్తున్నాయి. మహాత్ముడి అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంటాడు డేవిడ్ రెడ్డి. అమాయక భారతీయుల్ని హింసిస్తున్న ఆంగ్లేయులపై ప్రతి దాడులు చేస్తూ వారికి దడ పుట్టిస్తాడు.

- Advertisement -
David Reddy Teaser Manchu Manoj Birthday Release1

దేశంలో నెహ్రూ, బోస్ వంటి అగ్ర నాయకులు డేవిడ్ రెడ్డి గురించి తెలుసుకుంటూ ఉంటారు. మరోవైపు డేవిడ్ రెడ్డి రూపంలో తమ సామ్రాజ్యానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి లండన్ లోని బ్రిటీష్ ఇంటెలిజెన్స్ వార్ రూమ్ లో చర్చలు జరుగుతుంటాయి. 50 బెటాలియన్లలోని 2 వేల మందిని ఒంటరిగా ఎదుర్కొన్న డేవిడ్ రెడ్డి సాహసం, దేశాన్ని మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్న అతని వ్యక్తిత్వం బ్రిటీషర్స్ ను ఆకర్షిస్తుంది. డేవిడ్ రెడ్డిని తమ కోసం పనిచేసేలా ఒప్పించాలని బ్రిటీషర్స్ ప్లాన్ చేస్తారు.

David Reddy Teaser Manchu Manoj Birthday Release2

అమాయకుల్ని కాపాడే డేవిడ్ రెడ్డి దేశాన్ని ఎందుకు మోసం చేయాలనుకున్నాడు ?, భారతీయులే అతన్ని అరెస్ట్ చేయాలని ఎందుకు కోరుకున్నారు ?, డేవిడ్ రెడ్డి అంతిమ లక్ష్యం ఏంటి, బ్రిటీష్ యువతితో అతని ప్రేమ కథ ఎలా సాగింది…? ఇలాంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తి కలిగించింది. డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అని బ్రిటీషర్స్ భయంతో చెప్పడం అతని క్యారెక్టర్ లోని వైల్డ్ నెస్ ను చూపిస్తోంది. డేవిడ్ రెడ్డి పాత్రలో మంచు మనోజ్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ చేశారు. ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు టీజర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి.

నటీనటులు – మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా, రమ్య కృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన, తదితరులు

టెక్నికల్ టీమ్

ప్రొడ్యూసర్స్ – భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి
స్క్రిప్ట్, డైరెక్టర్ – హనుమారెడ్డి యక్కంటి
మ్యూజిక్ – రవి బస్రూర్
డీవోపీ – ఆచార్య వేణు
ఎడిటింగ్ – ఉజ్వల్ కులకర్ణి
ఆర్ట్ – తాళ్లూరి కృష్ణ మోహన్
యాక్షన్ – సుప్రీమ్ సుందర్, వింగ్ చున్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కొట్టు రవికుమార్
కాస్ట్యూమ్స్ – మానస నున్న

- Advertisement -
RELATED ARTICLES

Latest News