Homeమెదక్‌PHC Inspection | పీహెచ్‌సీ సేవలపై కేంద్ర బృందం తనిఖీ

PHC Inspection | పీహెచ్‌సీ సేవలపై కేంద్ర బృందం తనిఖీ

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు (స్క్రీనింగ్), మందుల పంపిణీ, సంబంధిత రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమావేశమై ఆరోగ్య సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎన్‌సీడీ సర్వేను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర బృందం సూచించింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News