Homeమెదక్‌మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చెందిన రాయపోల్ రాధిక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మంగళవారం మృతురాలి నివాసానికి చేరుకుని, ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాధిక పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి ఈ శోకం నుండి కోలుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

- Advertisement -
Vantru Pratap Reddy Condoles Rayapol Radhika Family in Pragnyapur3

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మరికంటి కనకయ్య, స్థానిక నాయకుల తో పాటు తన చిన్ననాటి మిత్రులు శ్రీమతి. రాణి.మాధవి. సప్న. శైలజ. అహ్మద్ బ్రహ్మచారి మహేష్ నవీన్ వెంకటరెడ్డి గోపి సురేష్ గౌడ్ పోశయ్య సత్తిరెడ్డి సత్యనారాయణ పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News