Monday, May 18, 2026
Homeరంగారెడ్డిMalkajgiri | గత పాలకల నిర్లక్ష్యమే ఉద్యమకారులకు శాపం

Malkajgiri | గత పాలకల నిర్లక్ష్యమే ఉద్యమకారులకు శాపం

  • గుండా నిరంజన్
  • ఉద్యమం పేరుతో వాడుకున్న బిఆర్ఎస్ ఏనాడు ఉద్యమకారులకు వరగబెట్టిందేమీ లేదు : నయీమ్ ఖాన్
  • మల్కాజిగిరిలో ఉద్యమకారులకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు మైనంపల్లి : ఉద్యమకారుడు రాందాస్ రాజ్

మల్కాజిగిరి నియోజకవర్గం ఆనంద్ బాగ్ లో గల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్యాంప్ కార్యాలయంలో , ఉద్యమకారుడు గుండా నిరంజన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉద్యమాకారుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు .ఈ సందర్భంగా ఉద్యమకారుడు గుండా నిరంజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యమకారులకు అండగా ఉంటామని ఇచ్చినా మాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి, తమకు మేలు చేయాలి అని ప్రత్యేకంగా ఫైవ్ మాన్ కమిటీ ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

గత సంవత్సరం క్రితమే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల లిస్టును ఉద్యమకారులతో తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించడం జరిగిందని అన్నారు .ఈ రోజు వరకు మల్కాజ్‌గిరిలో ఉద్యమకారులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తమకు అన్ని విధాలుగా అండగా ఉంటూ 10 ఉద్యమకారులలో ఐదు మంది ఉద్యమకారులు ప్రత్యేకంగా, పరోక్షంగా సహాయం పొందిన వారే అని తెలిపారు.

- Advertisement -

గతంలో దళిత బంధు పథకంలో కూడా అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారికి దళిత బంధు వచ్చే విధంగా కృషిచేసిన గొప్ప నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని అన్నారు. ఉద్యమకారుడు రాందాస్ సంతోష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ , ఉద్యమకారులకు ఏదైనా చేసే అవకాశం ఉన్న ఉద్యమకారులను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల కోసం ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన న్యాయం, గుర్తింపు ఇవ్వాలని కమిటీ వేయడం ఉద్యమకారులు వారి కుటుంబాలలో నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు .మల్కాజ్‌గిరిలో ఉద్యమకారులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లాంటి నాయకుడు దొరకడం తమ అదృష్టమని ఇలాంటి నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులకు ఎంతగానో అవసరమని అన్నారు.

ఉద్యమకారులకు ఎల్లవేళలా అండగా ఉంటూ తమను కంటి రెప్పలా కాపాడుతున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, సిరిగిరి నర్సింగ్ రావు, గుండా నిరంజన్, సంతోష్ రాందాస్, నయీంఖాన్ ,మోతే సాయికుమార్, పార్థసారథి, ములుగు శ్రీనివాస్, కుమార్, రాగం రాజు,గడ్డం నరేష్ , అరుణ్ కుమార్, కార్తీక్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News