- పాదయాత్ర కాదు, పొర్లు దండాల యాత్ర చేసినా లాభం లేదు..
- విమర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
నిన్న పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై జిల్లాకు చెందిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలను ఖండిస్తూ, నేడు CLP కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మహబూబ్ నగర్, దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే GMR మాట్లాడుతూ,
బిఆర్ఎస్ నాయకులు పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్ళినపుడు అందరు ఒకచోట కలిసి సరదాగా ఓ ప్రెస్ మీట్ పెడతారు. నిన్నటి సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఇరిగేషన్, వరి కొనుగోళ్లు, జిల్లాకు ముఖ్యమంత్రి గా
ఏమి చేశారంటూ మాట్లాడారు.
బిఆర్ఎస్ నాయకులు పదే, పడే మాట్లాడుతున్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల జలాల ఆధారంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పన చేసింది. తేదీ 10, జూన్ , 2015 నాడు పాలమూరు ప్రాజెక్టుకు జూరాల జలాలు కాదని , శ్రీశైలం మిగులు జలాల ఆధారంగా ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 105 తీసుకువచ్చింది.
జూన్ 11 2015 నాడు పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కరివేన వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేసి, జిల్లా ప్రజలకు నీరు అందిస్తామని కేసీఆర్ తెలియ చేస్తూ, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టించండి, ఇక్కడ కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని ప్రకటించారు. 2023 నవంబర్ నాటి వరకు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ సమయంలో ఒక్క నాడు కూడా కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి పై ఒక్క రివ్యూ నిర్వహించలేదు, ఎందుకు?
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఏ ఒక్క రోజు కూడా కెసిఆర్ ను అడగలేదు, కేసీఆర్ పై ఒత్తిడి చేయలేదు.
2016 లో ప్రారంభించిన కాలేశ్వరం, ఒక సంవత్సర కాలం 2017 లోనే ప్రాజెక్టు సంబంధించి డి.పి.ఆర్ తో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకువచ్చి, బిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించింది, నిర్మించిన కొద్ది రోజులకే ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించింది 2015 లో, దాని డిపిఆర్ ను సెప్టెంబర్ 2022 నాడు సమర్పించింది, ఆ డిపిఆర్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ తిరస్కరించింది.
మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న బిఆర్ఎస్ పాలకులు 7 ఏండ్ల అనంతరం డిపిఆర్ సమర్పించారు, ఇక్కడే అర్థం చేసుకోవచ్చు, జిల్లాకు చెందిన మంత్రుల,ఎమ్మెల్యేల అసమర్ధతను, వారి చిత్త శుద్ధిని BRS నాయకులు 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేశామని, అవాస్తవాలకు తెర లేపారు 33,500 కోట్ల రూపాయల అంచనావ్యయంతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ను ప్రారంభించారు, చివరికి 55,500 కోట్ల రూపాయల అంచనాలతో డిపిఆర్ సమర్పించారు.
డిపిఆర్ సమర్పించే నాటికి, ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది 27 వేల కోట్లు మాత్రమే. ప్రాజెక్ట్ పై 27 వేల కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు ఎలా పూర్తి చేశారో బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు 11 రోజుల ముందు ఆఘామేఘాల మీద, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, నార్లపూర్ వద్ద కెసిఆర్ ఒక మోటర్ ఆన్ చేస్తే, కేసీఆర్ తిరిగి పాలమూరు నుండి పట్నం వచ్చే లోపు మోటార్ ఆగిపోయింది.
చరిత్రలో ఎక్కడ లేని విధంగా, మెయిన్ కెనాల్ లకు భూసేకరణ చేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు
బిఆర్ఎస్ ప్రభుత్వం 2015 సంవత్సరం లోనే కాలువలకు భూసేకరణ చేసి ఉంటే, తక్కువ ఖర్చులో భూసేకరణ జరిగి ఉండేది.
ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 86000 వేల కోట్ల రూపాయల అంచనా ఉంది. అయినా మా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా, ఇప్పటికే పలుమార్లు ఇరిగేషన్ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి పై రివ్యూ సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేశాం.
బిఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేస్తాం అనడం చూస్తుంటే, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు అనిపిస్తుంది. ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పడావు పెట్టి, యుద్ధ ప్రాతిపదికన కాలేశ్వరాన్ని పూర్తి చేస్తుంటే, పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు పాలమూరు – రంగారెడ్డిని పూర్తి చేయమని కనీసం ఒత్తిడి చేసిన పాపాన పోలేదు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పై, ముఖ్యమంత్రి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు మల్లి అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారు.
మీరు అధికారంలోకి వచ్చేది లేదు, 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుంది. పాలమూరుకు ముఖ్యమంత్రి ఏం చేశారు అంటున్నారు… అడిగిందే తడువుగా పాలమూరుకు ట్రిపుల్ ఐటీ, లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు, అదేవిధంగా పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు మంజూరు చేశారు. మా ముఖ్యమంత్రి విద్యా, వైద్యం, ఇరిగేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాకు అత్యధికంగా నిధులు కేటాయించారు.
మీరు పాదయాత్ర చేసిన, పొర్లు దండాలు పెట్టిన మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి,ప్రసక్తే లేదు. మీరు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదు, మొన్న జరిగిన గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మీకు గుణపాఠం చెప్పారు, భవిష్యత్తులో కూడా మీకు గుణపాఠం తప్పదు. మేము మీలా పదేళ్లు అధికారంలో లేము, మేము అధికారంలోకి వచ్చి కేవలం రెండు సంవత్సరాల నాలుగు నెలలే అవుతుంది, అభివృద్ధికి అడ్డుపడకండి, అభివృద్ధికి సహకరించండి.
పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగలో, మంత్రులందరి సమక్షంలోనే పాలమూరు జిల్లాకు సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ధైర్యంగా తెలియజేసి, ఆ దిశగా అడుగులు వేస్తూ, జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలందరం వరి కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, రెగ్యులర్ గా కొనుగోళ్లపై సమీక్షలు చేస్తూ, అధికారులకు ఆదేశాలిస్తూ రైతులకు అండగా ఉంటున్నాం.
పాలమూరు అభివృద్ధికి, పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతుంటే, విమర్శించడం సరైనది కాదు, మీ పంథా మార్చుకోండి, పాలమూరు అభివృద్ధికి మీ సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం.
