Saturday, May 16, 2026
Homeబిజినెస్Bullion | తగ్గిన బంగారం, వెండి ధరలు..

Bullion | తగ్గిన బంగారం, వెండి ధరలు..

  • అమెరికా డాలర్ బలోపేతం కావడం ఒక కారణం..
  • హైద్రాబాద్ లో ఏకంగా రూ. 15 వేలు తగ్గుదల..

అంతర్జాతీయ మార్కెట్ల లోని పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు నేలచూపులు చూశాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం లాంటి అంశాలు దేశంలో పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఈ విలువైన లోహాల ధరలు మరోసారి భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం.. ఇవాళ‌ ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే రూ.980 తగ్గి రూ.1,56,930కి పడిపోయింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.900 తగ్గి రూ.1,43,850 వద్ద స్థిరపడింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై ఏకంగా రూ.15,000 మేర పతనం నమోదైంది. ఈ భారీ తగ్గుదలతో ఇవాళ కిలో వెండి ధర రూ.2.9 లక్షలకు దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లోని మార్పులే దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News