Wednesday, May 13, 2026
HomeజాతీయంCancellation | తమిళనాడు గవర్నమెంట్ లో కీలక పరిణామం..

Cancellation | తమిళనాడు గవర్నమెంట్ లో కీలక పరిణామం..

  • జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ పండిట్ నియామకం రద్దు..
  • అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే పండిట్ నియామకం..

తమిళనాడు పాలనా విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఓఎస్డీగా నియమితుడైన జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో బుధవారం అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎస్‌డీగా రాధన్ పండిట్ నియామకాన్ని టీవీకే కూటమిలోని పార్టీ నేతలే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

రాధన్ పండిట్ తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన ఆస్ట్రాలజర్. ఎంతోమంది ప్రముఖుల విజయాన్ని ముందే ఊహించారు. జయలలిత రాజకీయ భవితవ్యం గురించి గతంలో కచ్చితంగా చెప్పగలిగారు. తాజాగా, టీవీకే ప్రభుత్వాన్ని స్థాపించిన విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన గతంలోనే చెప్పారు. ఇదే సమయంలో ఆయన విజయ్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. టీవీకే తరఫున పలు మీడియా సంస్థల చర్చల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ఆయన ఊహించినట్లే విజయ్ తమిళనాడులో అధికారం చేపట్టారు. సీఎం అయ్యారు దీంతో విజయ్.. ఆయనను తన ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయంపై టీవీకేతో కూటమిలో ఉన్న ఎంజేకే, డీఎండీకే, వీసేకే వంటి పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. రాధన్ పండిట్ నియామకాన్ని తప్పుబట్టారు. డీఎంకే, ఆ కూటమి పార్టీలు కూడా ఈ విషయంలో విమర్శలు చేశాయి. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓఎస్డీ అంటే.. రాజకీయంగా సమన్వయం చేయడంతోపాటు సలహాదారుగా కూడా పని చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News