Monday, May 11, 2026
Homeఅంతర్జాతీయంIron Dome | ఇజ్రాయిల్ కు షాకిచ్చిన హిజ్ బొల్లా..

Iron Dome | ఇజ్రాయిల్ కు షాకిచ్చిన హిజ్ బొల్లా..

  • ఐరన్ డోమ్ ను చేధించిన వైనం..
  • సంబంధిత ఫుటేజీ విడుదల..

లెబనాన్‌ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా తాజాగా ఇజ్రాయెల్‌ కు షాకిచ్చింది. అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుపొందిన ఐరన్ డోమ్‌ ను ఛేదించగలిగింది. ఐరన్ డోమ్‌ వ్యవస్థలో కీలక భాగమైన మిసైల్ లాంచింగ్ యూనిట్‌ను ఎఫ్‌పీవీ డ్రోన్‌తో ధ్వంసం చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫుటేజీని కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కొన్నిరోజుల క్రితమే ఈ దాడి జరిగింది.

అయితే ఈ దాడి ఫుటేజీని సేకరించేందుకు హెజ్బొల్లా కొంత సమయం తీసుకున్నట్టు సమాచారం. హెజ్బొల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ డిఫెన్స్ దళాలు ఇంకా స్పందించలేదు. ఎఫ్‌పీవీ డ్రోన్స్‌ను అడ్డుకోవడం ఇజ్రాయెల్ దళాలకు సవాలుగా మారిందన్న వార్తలు ఇప్పటికే అనేకం వెలువడ్డాయి. సంప్రదాయక మిసైల్స్‌, రాకెట్స్‌, డ్రోన్స్‌ను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ అభివృద్ధి చేసుకున్న ట్రాకింగ్ వ్యవస్థలు, జామర్లు ఎఫ్‌పీవీ డ్రోన్‌ల విషయంలో తడబడుతున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News