- అసలే పంటలు దిగుబడి రాక అవస్థలు పడుతున్న అన్నదాతలకు ఈ అకాల వర్షం రైతుల పాలిట యమపాశంగా మారింది…
చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది…. అకస్మాత్తుగా వర్షం పడడంతో ధాన్యం పై టార్పాలిన్లు వేసినా,గాలి వాన భీభత్సానికి కొట్టుకపోయి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది…ఐకెపి సెంటర్లలో ఆరబోసిన ధాన్యం సైతం తడిచిపోయింది… తడిచిన ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు
చెన్నూర్ మండలం లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది..
అకాల వర్షానికి మండలం లోని పలు వడ్ల కొనుగోలు సెంటర్ల లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరొక పది రోజులు సమయం పడుతుందని రైతులు వాపోయారు.. కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రంను కేటాయించకపోవడంతో జాడలేని లారీలతో అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..
రైతు పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తవుతుందని ఆవేదన చెందారు.. పండించిన పంటను విక్రయించేంతవరకు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు.. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు తమ గోడును అర్ధం చేసుకుని లారీలను పంపి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు…
