Wednesday, May 6, 2026
Homeఆదిలాబాద్Protest | మొక్కజొన్న, జొన్న రైతుల ఆందోళన…

Protest | మొక్కజొన్న, జొన్న రైతుల ఆందోళన…

  • బైంసా 61 జాతీయ రహదారి హైవేపై ధర్నా…

నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న, జొన్న రైతుల ఆందోళన ధర్నాకు దారి తీసింది.. నిర్మల్ జిల్లాలలో రైతుల పండించిన మొక్కజొన్న, జొన్న పంటలను ప్రభుత్వము కొనుగోలు చేయడం లేదంటూ దిలావర్పూర్, నర్సాపూర్ మండలాల రైతులు టెంబూర్ని ఎక్స్ రోడ్ వద్ద 61 జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి వాహనాలను రాకపోకలను అడ్డుకున్నారు… కొనుగోలు కేంద్రాలలో మొక్కజొన్న, జొన్నలను అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన నిర్వహించారు..

పంట కోసి రోజులు గడుస్తున్న అధికారులు ఇప్పటివరకు గోనే సంచులు , కాంటాలను ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు… ఎన్నో రోజుల నుంచి అధికారులకు మొరపెట్టుకున్న తమ గోడును పట్టించుకోవడంలేదని ఈరోజు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు… ప్రభుత్వం వెంటనే మక్కలు, జొన్నలు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నారు…

- Advertisement -
RELATED ARTICLES

Latest News