Wednesday, May 27, 2026
Homeరంగారెడ్డిCelebrations | రిథమ్ డాన్స్ అకాడమీ 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

Celebrations | రిథమ్ డాన్స్ అకాడమీ 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

బాలాజీ నగర్‌కు చెందిన రిథమ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వరల్డ్ డాన్స్ డే సందర్భంగా కూకట్‌పల్లి ప్రాంతంలోని ఇందిరా చంద్ర శంకర్ హాల్‌లో కల్చరల్ డాన్స్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకతో పాటు అకాడమీ 26వ వార్షికోత్సవ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నృత్య గురువులు గురు శ్రీనివాస్ రావు పోట్నిని, గురు డా. జయరామన్ బాలకృష్ణ, మాదేవి నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు.

నృత్య కళా అభివృద్ధికి అకాడమీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. అకాడమీ స్థాపకుడు కొన్నేటి నర్సింహులు రాజు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల నృత్య ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమం మొత్తం సాంస్కృతిక వైభవంతో కళకళలాడింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News