బెల్లంపల్లి పట్టణం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ ఈ రోజు జీవో ఎం ఎస్ నంబర్ 3 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎంది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి సోమవారం ఉదయం 10:30గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఏదైతే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందో దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ డివిజన్ ఆఫీసులు అందులో ఉన్న ఆర్డీవో లు సబ్ కలెక్టర్ లు వాళ్ళని తీసుకోమని జీవో ఎం ఎస్ నెంబర్ 3 ద్వార ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

దానికి తగ్గటుగా ఈ రోజు ఉదయం 10:30గంటలకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం బెల్లంపల్లి కి సంబంధించి ప్రజావాణి కండెక్ట్ చేయడం జరిగింది. ఆల్ డివిజన్ అధికారులు లైన్ మెన్ డిపార్ట్ మెంట్స్ ఎలక్ట్రిసిటీ ఆర్ & బి పంచాయతీ రాజ్ హౌసింగ్ ఇరిగేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇతర డిపార్ట్మెంట్ మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ పాల్గొనడం జరిగింది డివిజన్ సంబంధించి ఎంపిడిఓ ఎమ్మార్వోస్ కూడా ఇక్కడికే రావడం జరిగింది సుమారు ఈ రోజు 32 అప్లికేషన్స్ రావడం జరిగింది ఇంకా ఈ రోజు మొదటి రోజు ఇంకా కూడా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం సద్వినియోగం చేసుకొని వారి యొక్క పిటిషన్లు ఇవ్వవలసిందిగా కోరారు
