కుర్చీ కక్కుర్తి.. గరీబోని గోస.. యూనియన్ లీడర్లమంటూ.. ఊరేగుతరు వీళ్ళు ఉద్యోగుల సంక్షేమాన్ని.. తుంగలో తొక్కిన్రు చూడు! అవినీతి కంపులోన.. అలుముకున్నరు మస్తుగ స్వార్థపు సెల్కల్లోన.. పండుతున్నరు గర్వంగ! సంక్షేమం అంటే వీళ్లకు.. సొంత జేబులు నింపుడు అక్రమ నివేదికలతోని.. సర్కారు భూముల మింగుడు! నైతికత లేని నాయకత్వం.. నట్టేట ముంచుతది.. అవినీతి అడ్డా మీద.. నిప్పులు కురిపిస్తది! ఖబర్దార్ నాయకుడా.. నీ బుకాయింపు సాగది.. నిజం నిప్పులాంటిది.. నీ ఆట ఇంక సాగది!
- జ్వాల
- Advertisement -
