Friday, May 1, 2026
Homeరంగారెడ్డిAwareness | రైతులకు మట్టి ఆరోగ్య నిర్వహణపై అవగాహన..

Awareness | రైతులకు మట్టి ఆరోగ్య నిర్వహణపై అవగాహన..

  • రాయల పూర్ గ్రామంలో కార్యక్రమం నిర్వహణ..

మేడ్చల్ డివిజన్ పరిధిలోని రాయలాపూర్ గ్రామంలో గ్రామంలో శుక్రవారం భారత వరి పరిశోధనా సంస్థ (ICAR–IIRR) ఆధ్వర్యంలో రైతు వేదికలో రైతులకు మట్టి ఆరోగ్య నిర్వహణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు రైతులు తమ నేలను తామే సులభంగా పరీక్షించుకునేందుకు భారత వరి పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన ప్రత్యేక మట్టి పరీక్ష కిట్‌ను రైతులకు పరిచయం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ కిట్ ద్వారా భూమిలోని పోషక స్థాయిలను గుర్తించి, సరైన ఎరువుల వినియోగంపై శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని వివరించారు. ప్రధాన శాస్త్రవేత్త డా. బ్రజేంద్ర తన బృందంతో కలిసి మట్టి పరీక్ష కిట్ వినియోగంపై ప్రాక్టికల్ డెమో నిర్వహించామని తెలిపారు.

- Advertisement -

డా. కావిరాజు రైతులకు ప్రాయోగికంగా వివరించారు. భారత వరి పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన ఒక్కొక్కటి ₹1000 విలువ గల 30 మట్టి పరీక్ష కిట్లను రైతులకు ఉచితంగా పంపిణీ చేశమని అన్నారు, మేడ్చల్ కు చెందిన అడ్వకేట్, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సలహాదారు చీర్ల చంద్రశేఖర్ సహకారంతో, రాయలాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు మట్టి పరీక్షలపై ఆసక్తి చూపించి, భవిష్యత్తులో ఈ విధానాలను అనుసరించేందుకు ముందుకు వచ్చారు అన్నారు,ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News