- అర్హులు దరఖాస్తు చేసుకోండి!!
- జిల్లా యువజన, క్రీడల కార్యాలయం, రంగారెడ్డి జిల్లా ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్, ఎల్.బి. నగర్
గ్రామీణ ప్రాంతములో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు-2026
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో, రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలలో 1వ మే 2026 నుండి 31వ మే 2026 వరకు (ఒక నెల), 14 సంవత్సరాల లోపు బాలబాలికల కోసం వివిధ గ్రామీణ క్రీడల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు – 2026 నిర్వహించబడును. ఈ శిబిరాలను నిర్వహించుటకు అనుభవజ్ఞులైన సీనియర్ క్రీడాకారులు / జాతీయ స్థాయి క్రీడాకారులు / వ్యాయామ ఉపాధ్యాయులు / ఫిజికల్ డైరెక్టర్లు నుండి దరఖాస్తులను, జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా ఆదేశాల మేరకు S. స్వర్ణలత, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, రంగారెడ్డి జిల్లా వారు ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు తాము నిర్వహించదలచిన క్రీడా విభాగం, క్రీడా ప్రాంగణం వివరాలు మరియు మొబైల్ నెంబర్ ను తెలియజేస్తూ తమ దరఖాస్తును తేదీ: 25.04.2026 లోపు క్రింది చిరునామాకు సమర్పించగలరు:
ఈ సదవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు.
E-mail id: [email protected] and 9848364143.
మరిన్ని వివరాలకు
S. స్వర్ణలత
జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం,
రంగారెడ్డి జిల్లా,
ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్, ఎల్.బి. నగర్ సంప్రదించగలరని తెలిపారు.
