Wednesday, April 22, 2026
Homeఅంతర్జాతీయంStrait of Hormuz | హార్మూజ్ జలసంధిలో కీలక పరిణామం..

Strait of Hormuz | హార్మూజ్ జలసంధిలో కీలక పరిణామం..

  • రెండు నౌకలపై ఇరాన్ సైన్యం దాడులు..
  • దెబ్బతిన్న ఒక కంటైనర్..

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొన్ని రోజులు పొడిగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొన్ని గంటలకే హర్మూజ్ జలసంధి లో కీలక పరిణామం చోటుచేసుకొంది. జలసంధిలో ఉన్న రెండు నౌకలపై ఇరాన్‌ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ కంటైనర్‌ నౌక దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ హర్మూజ్‌ జలసంధిలో ఓ కంటైనర్‌ నౌకపై కాల్పులకు పాల్పడిందని యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ పేర్కొన్నది. కాల్పులకు ముందు గన్‌బోట్‌ నౌకకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తెలిపింది. కాల్పుల్లో నౌకకు నష్టం వాటిల్లిందని, ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టంచేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే.. ఒక రవాణా నౌకపై కూడా ఇరాన్‌ కాల్పులు జరిపిందని పేర్కొన్నది. ఈ ఘటనలో సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, నౌకకు కూడా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది.

- Advertisement -

కాగా కంటైనర్‌ నౌకపై దాడిని ఇరాన్‌ మీడియా కూడా ధ్రువీకరించింది. ఐఆర్‌జీసీ పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ముందుకు కదలడంతోనే నౌకపై బలగాలు కాల్పలు జరిపినట్లు వెల్లడించింది. కాగా, టెహ్రాన్‌కు చెందిన వాణిజ్య నౌకను అమెరికా దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌.. నౌకలపై దాడులు చేయడం ఉద్రిక్తతలను మరోసారి తీవ్రం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News