Tuesday, April 21, 2026
Homeవరంగల్‌Farmers | మక్కలు అమ్మాలంటే చుక్కలు చూస్తున్న రైతులు..

Farmers | మక్కలు అమ్మాలంటే చుక్కలు చూస్తున్న రైతులు..

  • మార్క్ఫెడ్ వద్దంటే దళారుల పాలే….
  • పండించడం పావులవంతైతే అమ్మడం ముప్పావుల కష్టం…
  • రైతుల మనోవేదన

రైతులు ఆరుగాలం కష్టపడి తాను పండించిన పంటను ప్రభుత్వానికి అమ్ముకోవాలంటే ముప్పావుల కష్టమవుతుందని రైతులు మనోవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఎంఎస్పి రేటు ప్రకటించినప్పటికీ దళారులు వాటిని తుంగలో తొక్కి క్వింటా మొక్కజొన్నకు 6 నుంచి 800 వరకు మద్దతు ధరకు తక్కువ అడుగుతూ కొంటూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఎందుకు పండఇవ్వాలి రా ఈ పంటను అనే రీతిలో దళారుల ఆగడాలు చూసి రైతులు గుండె పగిలేలా రోదిస్తున్నారు.

రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఎవ్సం బాగుపడదు అనే రీతిలో ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారులు రాజకీయ ప్రజా ప్రతినిధులు కొనుగోలు సెంటర్ ను ప్రారంభించినప్పటికీ అవేవీ రైతుల మద్దతును చురగొనలేకపోతున్నాయి. పండించడం పావలా కష్టమైతే అమ్ముకోవడం ముప్పావుల కష్టమవుతుందని రైతులు మనోవేదన చెందుతున్నారు. ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్న సరైన సమయంలో బార్దానందక రైతులు దిగులు చెందుతున్నారు.

- Advertisement -

నర్సంపేట డివిజన్లో లక్ష ఎకరాల మక్క సాగు

ఏడాది వర్షాలు సంపూర్ణంగా పాడడంతో వేసిన పత్తి పంటలు వరి పంటలు , రైతులను ఆదుకోలేకపోయాయి. దీంతో వర్షంతో కరాబ్ అయిన పంటలను నూర్పి యాసింగి సీజన్లో అధికారిక లెక్కల ప్రకారం 75 వేల ఎకరాల్లో సాగు అయినప్పటికీ అనాధికారికంగా మరో 25 వేల ఎకరాల్లో సాగు కాబట్టి ఎకరాకు 35 క్వింటాల నుండి 40 క్వింటాళ్ల వరకు మొక్కజొన్న పండింది. దీంతో రైతు సంబరానికి లోనై రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎంఎస్పీ ధరకు అమ్ముకోవాలని ఉద్దేశంతో మార్కుపెట్టి సెంటర్లు ఏర్పడే వరకు ఆగారు.

ఇప్పటికే నర్సంపేట డివిజన్లో 6 మార్క్ ఫెడ్ సంస్థ మొక్కజొన్న కొనుగల్ కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ సరైన సమయంలో బార్ధా న్ అందక సరైన సమయంలో కాంటాలు కాక మార్క్ఫెడ్ సెంటర్లో వద్ద 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. కొనలేక కొర్రీలు పెడుతున్న మార్పిఫైడ్ అధికారుల తీరుపై రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఆందోళన చేస్తున్నప్పటికీ మార్క్ఫెడ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు.

తూర్పాల మిషన్లో మొక్కలు పోయాలంటే కనీసం ముగ్గురు నలుగురు వ్యక్తులు అవసరం అయినా ఉంటుందని అలా నూర్పిడి చేసినప్పటికీ కాంటాలు కాక కాంటాలు అయితే ట్రాన్స్పోర్టు కాక తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు 26 క్వింటాలే కొనుగోలు

ఈ ఏడాది మొక్కజొన్న పంటకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రతి ఎకరాకు 35 క్వింటాల నుండి 45 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. దీంతో రైతులు మార్కుపెడుకు అమ్ముకుంటున్న తరుణంలో ఆన్లైన్ ద్వారా వ్యవసాయ అధికారుల పంట సర్వే ప్రకారం పట్టా భూమి ఉన్నప్పటికీ ప్రతి ఎకరాకు 26 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొంటామని అందుకు పక్క ప్రణాళికంగా ఆన్లైన్లో మాడిఫై చేయడంతో రైతులు మిగతా మొక్కజొన్నలను దళారులకు అందించిన దుస్థితి ఏర్పడింది.

ఇదే అదనకు భావించిన దళారులు 2400 ఎం.ఎస్.పి రేటుకు బదులుగా 1600 నుండి 1800 వరకు కొంటూ రైతులను నట్టేట ముంచుతున్నారని రైతులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన రైతుల బతుకులు మాత్రం పంటలు పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం నాలుగెత్తులుగా మారుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. 7 ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం బాధలు ఇప్పుడు అమ్ముకోవడం కోసం బాధపడుతున్నామని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు.

మార్కాపురం అధికారులకు మొక్కలు అమ్మినప్పటికీ డబ్బులు పడాలంటే కనీసం 45 రోజులు కావాల్సి వస్తుందని అధికారులు తేల్చి చెబుతుండడంతో పంట డబ్బులు చేతికందకపోవడంతో రైతులు మరింత దిగులు పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి రైతులకు చేరువ కావాలని డబ్బులు సకాలంలో వెనువెంటనే రైతుల ఖాతాల్లోకి పంపించాలని రైతులు వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News