Homeరంగారెడ్డిJawahar Nagar | స్థలం మారిపిడి పై ఆగ్రహ జ్వాలలు

Jawahar Nagar | స్థలం మారిపిడి పై ఆగ్రహ జ్వాలలు

  • 647 సర్వే నెంబర్ కు చెందిన భూమి ప్రభుత్వ భూమి కాదా అని మండిపాటు
  • అధికార పార్టీ నాయకుల తీర్పుట్ల అనుమానాలు
  • అక్రమార్కులకు వత్తాసు పలికి రాజకీయ భవిష్యత్తును కోల్పోవద్దని హెచ్చరికలు
  • 647 సర్వేనెంబర్ కు చెందిన భూమిలో హాస్టల్ నిర్మాణం చేపట్టాలి
  • అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించబోమంటూ స్థానికుల ఆగ్రహం
  • కలెక్టర్ దృష్టి హాస్టల్ నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి

గ్రేటర్ జి హెచ్ ఎం సి జవహర్ నగర్

శిశు సంక్షేమం ఆధ్వర్యంలో నిర్మించే హాస్టల్ నిర్మాణం దినదినం వివాదాస్పదంగా మారుతుంది హాస్టల్ నిర్మాణం కోసం 647 సర్వేనెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిని కేటాయించి ప్రభుత్వ సెలవు దినము ఆదివారం అయినప్పటికీ శ్రామిక మహిళా వసతి గృహం నిర్మాణం చేపట్టడమే ఏకైక లక్ష్యంగా అధికారులు స్వయంగా ఆదివారం ముగ్గు పోసి హాస్టల్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు నేటి వరకు పనులు చేపట్టకుండా స్థల మార్పిడి కోసం అధికారులు తహతహలాడుతున్న తీరు స్థానికుల్లో దుమారం రేపుతోంది 647 సర్వేనెంబర్ కు చెందిన స్థలం ప్రభుత్వ స్థలం కాదా…?

- Advertisement -

ఈ స్థలం ప్రభుత్వ స్థలం కాకుండా ప్రైవేట్ స్థలం అయినచో ఈ స్థలంలో అధికారికంగా శ్రామిక మహిళా వసతి గృహం నిర్మాణం కోసం ఆదివారం స్వయంగా అధికారులు ముగ్గు పోసి ఈ స్థలం యజమానులను భయభ్రాంతులకు గురిచేసి అధికారులు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా…? లేక అధికారులు ఎలాంటి అధికార దుర్వినియోగానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి 647 సర్వేనెంబర్ కు చెందిన స్థలం పక్కా ప్రభుత్వ స్థలమే అని నిర్ధారించి హాస్టల్ నిర్మాణం కోసం ముగ్గు పోసి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యెడల హాస్టల్ నిర్మాణం విషయంలో జాప్యం ఎందుకు వహిస్తున్నారు…?

Jawahar Nagar Hostel Land Dispute Survey No 647 Controversy

లేక ప్రధాన రహదారికి పక్కన ఉన్న ఈ స్థలం సుమారు 12 కోట్ల నుండి 15 కోట్ల విలువచేసే విలువైన స్థలం కావడంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమాయక ప్రజలకు ప్లాట్లుగా విక్రయిస్తూ కోట్లు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈ 647 సర్వేనెంబర్ కు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు చాపను పట్టేందుకు ఎరను దానగా వేసే చందంగా అక్రమార్కులు అధికారులను లోబర్చుకునేందుకు అక్రమ మార్గంలో తెరచాటుగా పెద్ద మొత్తంలో అందజేసే ముడుపులకు ముచ్చటపడి హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి ముగ్గు పోసి నిర్మాణానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని వదిలిపెట్టి విలువైన ఈ స్థలాన్ని అక్రమార్కుల హస్తగతం చేసేందుకు అధికారులు నిశ్చయించుకొని వేరువేరు సర్వేనెంబర్లకు చెందిన స్థలాల్లో హాస్టల్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటూ విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా…? అనే విమర్శలు స్థానికుల నుండి వ్యక్తం అవుతున్నాయి

పైరవీల కోసం అధికార పార్టీ నాయకులకు…? కోటి లంచం అనే వినికిడి నిజమేనా…?

అత్యంత సులువుగా 647 సర్వేనెంబర్ కు చెందిన ఈ ప్రభుత్వ భూమిని తమ కైవసం చేసుకున్నామని ఈ భూమి ఆక్రమణకు పాల్పడిన అక్రమార్కుల కలలు కల్లలయ్యాయి శ్రామిక మహిళా వసతి గృహ నిర్మాణం కోసం అక్రమార్కుల ఆక్రమణలో ఉన్న 647 సర్వేనెంబర్ కి చెందిన భూమిలో అధికారులు ముగ్గు పోసి పనులు ప్రారంభించడంతో ఎంతో విలువైన భూమి చేయి జారిపోతుందని భయాందోళనకు గురైన అక్రమార్కులు ఎలాగైనా ఈ ప్రభుత్వ భూమిని హస్తగతం చేసుకోవాలంటే అధికార పార్టీ నాయకుల పైరవీ ఎంతో అవసరమని భావించి హాస్టల్ నిర్మాణాన్ని మరోచోటికి బదిలీ చేయించేందుకు పైరవీ కోసం అధికార పార్టీ నాయకులకు ఒక కోటి రూపాయలు ఇచ్చేందుకు తెరచాటుగా ఒప్పందం చేసుకొని 55 లక్షల రూపాయలు ముందుగా అందజేసి ఈ ప్రభుత్వ భూమి అక్రమార్కుల హస్తగతం అయ్యాక మిగతా 45 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఈ ఒప్పందం కారణంగానే 647 సర్వేనెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిలో నిర్మించే శ్రామిక మహిళ వసతి గృహ నిర్మాణాన్ని 646 సర్వే నెంబరు గల స్థలంలో చేపట్టేందుకు అధికార పార్టీ రాష్ట్రస్థాయి నాయకుల ఒత్తిళ్లకు లోనై అధికారులు స్థలం మార్పిడి కోసం తహతహలాడుతున్నారని స్థానికుల పుకార్లు షికారు చేస్తున్నాయి

అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తావిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని స్థానికుల హెచ్చరికలు

జవహర్ నగర్ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎలాంటి లోపాయి కార ఒప్పందాలకు చోటు ఇవ్వకుండా ప్రధాన రహదారికి పక్కన ఉన్న 647 సర్వేనెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిలో శ్రామిక మహిళ వసతి గృహం నిర్మాణం కోసం మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి అధికార పార్టీ నాయకులు కృషి చేయాలని లేనియెడల రాజకీయ భవిష్యత్తును కోల్పోక తప్పదని పార్టీలకతీతంగా జోహార్ నగర్ నాయకులు నాయకీ మనులు ప్రజా సంఘాల నాయకులు విద్యావేత్తలు ఉద్యమకారులు స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Jawahar Nagar Hostel Land Dispute Survey No 647 Controversy2

జవహర్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దవలసిన పూర్తి బాధ్యత శాసనసభ్యులు మల్లారెడ్డి అధికార పార్టీ నాయకులు పై ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు సహించబోరని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరూ చూడలేదు అన్నచందంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెరచాటు లోపాయికార తప్పిదాలకు పాల్పడితే ప్రజలు గ్రహించబోరని అమాయకంగా ఆలోచించి రాజకీయ భవిష్యత్తును కోల్పోవద్దని స్థానికులు హితవు పలుకుతున్నారు

హాస్టల్ నిర్మాణం పట్ల కలెక్టర్ దృష్టి సారించాలి శిశు సంక్షేమానికి కృషి చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ తరుణంలో శిశు సంక్షేమం ఆధ్వర్యంలో శ్రామిక మహిళ వసతి గృహ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేస్తూ ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దోబూచులాట ప్రదర్శిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు అధికారికంగా హాస్టల్ భవన నిర్మాణం కోసం ముగ్గు పోసి పనులు ప్రారంభించిన స్థలాన్ని మార్పిడి చేసి మరోచోట హాస్టల్ నిర్మాణాన్ని చేపడతామని రెవెన్యూ యంత్రాంగం ప్రదర్శిస్తున్న తీరు ప్రజా ఆగ్రహానికి గురిచేస్తోంది.

Jawahar Nagar Hostel Land Dispute Survey No 647 Controversy20

అధికారికంగా కేటాయించిన 647 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణాన్ని వేరే చోటికి తరలిస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు జరిపించి ఈ హాస్టల్ నిర్మాణం విషయంలో అధికారులు ఏమైనా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురై… లేదా.. అధికారుల స్వలాభం కోసం హాస్టల్ నిర్మాణం తరలింపుకు పాల్పడినట్లు తేలిన ఎడల విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ హాస్టల్ నిర్మాణం చేపడుతున్న 647 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని హాస్టల్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించి జవహర్ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని జవహర్ నగర్ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News