- ఎండుతున్న చెట్లు… నిర్లక్ష్యంలో అధికారులు
- మందు బాబులకు,ఆకతాయులకు అడ్డగా పల్లె ప్రకృతి వనం
- గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఉన్నారా..? లేరా
పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గత ప్రభుత్వం గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పల్లె ప్రకృతి వనాల్లో పండ్లు, పూల మొక్కలే కాకుండా రకరకాల చెట్లను పెంచి వాటిని గ్రామాల్లో ఇంటింటికి సరఫరా చేసి పల్లెలను ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. క్షేత్రస్థాయిలో నేడు అవి అధ్వానంగా మారాయి.

వాటిని పట్టించుక పోవడంతో నీటి కోసం తహ .. తహ లాడుతూ ఆ చెట్లు ఎండుతున్నాయి. ఎండుతున్న చెట్లను చూస్తుంటే గ్రామంలో ఆ పంచాయితీ కార్యదర్శి ఉన్నాడా..? లేడా..? ఉంటే ఏ ఒక్కరోజైనా అటుపక్క రావటం లేదా..? వస్తే ఎండుతున్న చెట్లు ఆయనకు కనిపించడం లేదా..?అనే సందేహం వ్యక్తం అవుతుంది. జగదేవపూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామ పల్లె ప్రకృతి వనం నేడు అధ్వానంగా మారింది ప్రకృతి వనంలో ఎక్కడ చూసిన పిచ్చి మొక్కలు, దర్శనమిస్తున్నాయి.

నీరు లేక చెట్లు ఎందుతున్నాయి.గత ప్రభుత్వం చెట్లకు నీటిని అందించడానికి ట్రాక్టర్లు సరఫరా చేస్తే వారు మాత్రం చెట్లకు కాకుండా గ్రామాల్లో నూతన గృహాలకు,శుభకార్యాలకు నీటిని సరఫరా చేసే శ్రద్ధ చెట్ల పై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని అన్ని గ్రామాల పల్లె ప్రకృతి వనాను సందర్శించి నూతన గృహాలకు,శుభకార్యాలకు ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరానీ పక్కకు పెట్టి ఎండుతున్న మొక్కలకు నీటిని సరఫరా చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
