Saturday, April 18, 2026
Homeఆదిలాబాద్Protest | కిష్టంపేట బస్ స్టాప్ వద్ద బిజెపి పార్టీ శ్రేణుల ఆందోళన.

Protest | కిష్టంపేట బస్ స్టాప్ వద్ద బిజెపి పార్టీ శ్రేణుల ఆందోళన.

బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చెన్నూరు మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన.

మహిళలు చట్ట సభల్లో, అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఒక మంచి లక్ష్యంతో బిజెపి పార్టీ మహిళా అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెడుతుంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్ష పార్టీలు కావాలనే మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ వారి అమ్మ సోనియాగాంధీ, అలాగే వారి అక్క ప్రియాంక గాంధీ వాళ్ళందరూ రాజకీయాల్లో ఉండొచ్చు కానీ సామాన్య మహిళలు రాజకీయాల్లో ఉండకూడదా అని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News