Saturday, April 11, 2026
Homeఅంతర్జాతీయంStrait of Hormuz | జలసంధిలో విచిత్ర పరిస్థితి..

Strait of Hormuz | జలసంధిలో విచిత్ర పరిస్థితి..

  • సముద్రగర్భంలో మైన్స్ గుర్తించడం కష్టతరం..

హోర్ముజ్ జ‌ల‌సంధిలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. యుద్ధంలో భాగంగా శ‌త్ర‌వులను ఎదుర్కొనేందుకు హోర్ముజ్ జ‌ల‌సంధిలో ఇరాన్ మైన్ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. సముద్ర నీటిలో వాటిని ఇరాన్ ప్లేస్ చేసింది. అయితే ప్ర‌స్తుతం చ‌మురు నౌక‌లకు రూట్‌ను క్లియ‌ర్ చేసేందుకు ఇరాన్ ఇబ్బందిప‌డుతోంది. జ‌ల‌సంధిలో ఎక్క‌డ, ఎంత లోతులో మైన్ల‌ను అమ‌ర్చిందో ఇరాన్ గుర్తించ‌లేక‌పోతున్న‌ట్లు అమెరికా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ మైన్ల‌ను గుర్తించి, వాటిని తొల‌గించే ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతున్న‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది.

జ‌ల‌సంధి మార్గంలో ఇరాన్ చాలా నిర్ల‌క్ష్యంగా మైన్ల‌ను నాటింద‌ని, దీని వల్ల సుర‌క్షిత‌మైన మార్గం ఏంటో తెలియ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు.. ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న‌రి గార్డ్ కార్ప్స్ కేర్‌లెస్‌గా ఆ మైన్ల‌ను పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నాటిక‌ల్ మైన్ల‌ను తొల‌గించే సామ‌ర్థ్యం ఇరాన్ వ‌ద్ద కానీ, అమెరికా వ‌ద్ద కానీ లేన‌ట్లు ఓ రిపోర్టులో తెలిపారు. కొన్ని ల్యాండ్‌మైన్లు స‌ముద్ర నీటిలో స్థ‌లం మారే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా చెప్పారు. జ‌ల‌సంధి మార్గంలో ఎక్క‌డెక్క‌డ మైన్ల‌ను అమ‌ర్చిన విష‌యాన్ని ఇరాన్ డాక్యుమెంట్ చేసిందా లేదా అన్న విష‌యం కూడా స్ప‌ష్టంగా తెలియ‌డం లేద‌ని అమెరికా అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

బుధ‌వార‌మే జ‌ల‌సంధిని ఓపెన్ చేశార‌ని, టోల్ ఫీజు వ‌సూల్ చేస్తోంద‌ని అమెరికా ఆరోపించింది. అయితే లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వ‌ర‌కు హోర్ముజ్‌లో ట్రాఫిక్‌ని ఆపేస్తామ‌ని ఇరాన్ పేర్కొన్న‌ది. హోర్ముజ్ జ‌ల‌సంధిలో సుమారు 3200 వెస‌ల్స్ చిక్కుకున్న‌ట్లు భావిస్తున్నారు. దీంట్లో 800 భారీ నౌక‌లు ఉన్నాయి.అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల‌కు చెందిన నౌక‌ల‌ను పేల్చేందుకు హోర్ముజ్ జ‌ల‌సంధిలో అండ‌ర్ వాట‌ర్ మైన్ల‌ను ఇరాన్ అమ‌ర్చిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

Latest News