Thursday, April 9, 2026
HomeతెలంగాణTollywood | టాలీవూడ్ లో మరో వివాదం..

Tollywood | టాలీవూడ్ లో మరో వివాదం..

  • టి ఎఫ్ టి సి ప్రతిపాదనాపై అగ్రనిర్మాతల అభ్యంతరం..
  • ఫిలిం చాంబర్ కు లేఖ రాసిన ఏ టి ఎఫ్ పీ జీ.

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం రాజుకుంది. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రతిపాదించిన “పర్సంటేజ్ ఆధారిత స్క్రీనింగ్ మోడల్”పై అగ్ర నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఏకపక్షంగా తమపై రుద్దడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏప్రిల్ 8న ఛాంబర్‌కు ఓ అధికారిక లేఖ రాసింది.

మార్చి 25, ఏప్రిల్ 2 తేదీలలో టీఎఫ్ సీసీ జారీ చేసిన సర్క్యులర్‌లను ప్రస్తావిస్తూ, ఈ కొత్త విధానం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని వారు కోరారు. ఎగ్జిబిటర్లతో నేరుగా చర్చలు జరిపి, తమ నిబంధనల ప్రకారమే సినిమాలను పంపిణీ చేసుకుంటామని గిల్డ్ స్పష్టం చేసింది. టీఎఫ్ సీసీ ప్రతిపాదించిన కొత్త విధానాన్ని పాటించే థియేటర్లకు తమ సినిమాలను ప్రదర్శన కోసం ఇచ్చేది లేదని నిర్మాతలు తమ లేఖలో అల్టిమేటం జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖపై సంతకాలు చేసిన వారిలో టాలీవుడ్‌లోని పలు అగ్ర నిర్మాణ సంస్థల అధినేతలు ఉన్నారు.

- Advertisement -

వారిలో రవిశంకర్ యలమంచిలి (మైత్రీ మూవీ మేకర్స్), సుధాకర్ చెరుకూరి (ఎస్ఎల్‌వి సినిమాస్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), రవికిశోర్ (స్రవంతి), సుప్రియ (అన్నపూర్ణ స్టూడియోస్), బాపినీడు (ఎస్‌వీసీసీ), స్వప్న దత్ (స్వప్న సినిమా), సాహు గారపాటి (షైన్ స్క్రీన్స్), రాజీవ్ రెడ్డి (ఫస్ట్ ఫ్రేమ్), వెంకట సతీష్ కిలారు (వృద్ధి సినిమాస్), నాని (వాల్ పోస్టర్ సినిమా), చిట్టూరి శ్రీనివాసరావు (శ్రీనివాస సిల్వర్ స్క్రీన్), బన్నీ వాసు (బన్నీ వాస్ వర్క్స్), ఎస్‌కేఎన్ (మాస్ మూవీ మేకర్స్), ధీరజ్ మొగిలినేని (ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్) ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News